logo

నకిలీ నోటీసులతో బెదిరిస్తున్నారు

తన ఇంటికి నకిలీ నోటీసులు పంపుతూ ఎమ్మిగనూరుకు చెందిన శాంతిరాజు డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన వెంకటేష్‌ ఎస్పీకి విన్నవించారు.

Published : 02 Jul 2024 04:37 IST

బాధితుడి సమస్య వింటున్న ఎస్పీ జి.కృష్ణకాంత్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : తన ఇంటికి నకిలీ నోటీసులు పంపుతూ ఎమ్మిగనూరుకు చెందిన శాంతిరాజు డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన వెంకటేష్‌ ఎస్పీకి విన్నవించారు. నగరంలోని కొత్తపేట క్యాంపు కార్యాలయంలో ఎస్పీ జి.కృష్ణకాంత్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలు తెలుసుకుని వినతులు స్వీకరించారు. మొత్తం 76 వినతులు రాగా స్థానిక పోలీసు అధికారులకు అప్పగించారు.

వచ్చిన సమస్యల్లో కొన్ని..

  • బెంగళూరు స్టార్టప్‌ ఎస్‌బీఎన్‌ఆర్‌ మార్కెటింగ్‌ సంస్థ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 80 మందిని మోసగించారని, న్యాయం చేయాలని అనంతపురం, నంద్యాల, కర్నూలు, కదిరి, తిరుపతి, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు.
  • సిరి గార్డెన్‌ రియల్‌ఎస్టేట్‌ పేరుతో రెండు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి పదేళ్లపాటు కంతులు కట్టించుకుని మోసగించారని నంద్యాలకు చెందిన శ్రీలత ఫిర్యాదులో పేర్కొన్నారు.
  • ఇంటి ముందు ముళ్ల కంచె వేసి ఆస్తి ఇవ్వాలంటూ కుమారుడు ఇబ్బంది పెడుతున్నాడని.. రక్షణ కల్పించాలని కర్నూలు మండలం ఉల్చాలకు చెందిన శంకర్‌రెడ్డి కోరారు.
  • కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానంటూ కర్నూలుకు చెందిన వ్యక్తులు నమ్మించి డబ్బులు తీసుకుని మోసగించారని హైదరాబాద్‌కు చెందిన హరిబాబుయాదవ్, కె.వి.చౌదరి ఫిర్యాదు చేశారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని