logo

పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ కర్తవ్యం

పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 04:13 IST

న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్‌

నంద్యాల పట్టణం నందమూరినగర్‌లో పింఛన్లు పంపిణీ చేస్తున్న మంత్రి ఫరూక్, తెదేపా నాయకులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం ఉదయం 6 గంటల నుంచే మంత్రి ఫరూక్‌ విస్తృతంగా పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను సొమ్ము పంపిణీ చేశారు. పింఛన్ల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.819 కోట్ల భారం పడుతున్నా ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. గతంలో జగన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ స్కీములన్నీ స్కాములుగా మారాయన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని