logo

హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నాం

ప్రజాగళం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్లను తెదేపా ప్రభుత్వం రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచి పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ చెప్పారు.

Published : 01 Jul 2024 02:27 IST

మాజీ మంత్రి ఫరూక్‌

మందులు పంపిణీ చేస్తున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ప్రజాగళం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్లను తెదేపా ప్రభుత్వం రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచి పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ చెప్పారు. పెంచిన పింఛన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని హర్షిస్తూ నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఫరూక్‌ దివ్యాంగులతో కలిసి పాల్గొన్నారు. దివ్యాంగులకు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లో చట్టరీత్యా కేటాయించాల్సిన ఐదు శాతం నిధులను దివ్యాంగుల అభివృద్ధికి వెచ్చించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 20 మందికి ఆ సంఘం తరఫున మంత్రి మందులు పంపిణీ చేశారు. కేకు కోసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, కౌన్సిలర్‌ శ్యాంసుందర్‌లాల్, దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి, గౌరవాధ్యక్షుడు రవికృష్ణ, సమన్వయకర్త ఎంపీవీ రమణయ్య, ఉపాధ్యక్షుడు వెంకటరావు, కోశాధికారి చలపతి, లయన్స్‌క్లబ్‌ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని