logo

వైకాపా నాయకులకు వత్తాసు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం కోల్పోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కొంత మంది రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఆ పార్టీ నాయకులపై అభిమానం తగ్గడం లేదు

Published : 30 Jun 2024 03:30 IST

పొక్లెయిన్‌తో ట్రాక్టర్‌లో వేస్తున్న గరుసు  

కోసిగి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం కోల్పోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కొంత మంది రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఆ పార్టీ నాయకులపై అభిమానం తగ్గడం లేదు. కోసిగి మండలంలోని ఐరన్‌గల్‌ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు వెంకటేశ్‌ గ్రామ శివారులో తన సొంత స్థలంలోకి అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు తలారి అంజి, భీమసేన, విశాక్, రాజు నాలుగు ట్రాక్టర్లతో చాప వంకలో సుమారు 50 ట్రిప్పులు గరుసు తరలించారు. తహసీల్దార్‌ మురళీ, ఎస్సై సతీశ్‌కుమార్‌ మద్దతుతోనే వారు ఈ అక్రమాలు ఆపడం లేదని, జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మంత్రాలయం నియోజకవర్గం తెదేపా నాయకుడు రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. గరుసు తరలిస్తుండగా ‘న్యూస్‌టుడే’ ప్రతినిధి అక్కడే ఉండి తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వగా వీఆర్వోను పంపించి చర్యలు తీసుకుంటానన్నారు. ఎంతసేపటికి ఆయన రాకపోవడంతో మరోసారి తహసీల్దార్‌కు ఫోన్‌ చేయగా ఆయన స్పందించలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని