logo

జాతీయ లోక్‌అదాలత్‌లో.. 1,139 కేసుల పరిష్కారం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 ప్రాంతాల్లోని 23 కోర్టు బెంచుల్లో జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా 1,139 కేసులు పరిష్కారమయ్యాయి.

Published : 30 Jun 2024 02:54 IST

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావు 

కర్నూలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 ప్రాంతాల్లోని 23 కోర్టు బెంచుల్లో జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా 1,139 కేసులు పరిష్కారమయ్యాయి. నగరంలోని న్యాయసేవాసదన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇది శాశ్వత పరిష్కారమని చెప్పారు.  జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి, ఆరో అదనపు జిల్లా జడ్జి పాండురంగారెడ్డి, అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనర్సింహారెడ్డి, కర్నూలు అదనపు సివిల్‌ జడ్జి దివాకర్, జిల్లా అదనపు సివిల్‌ జడ్జి టి.జ్యోత్న్సాదేవి, స్పెషల్‌ ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్, నాలుగో అదనపు జిల్లా జడ్జి సరోజనమ్మ పాల్గొన్నారు.  కర్నూలులో 288, ఆదోని 78, ఆళ్లగడ్డ 77, ఆలూరు 31, ఆత్మకూరు 44, బనగానపల్లి 31, డోన్‌ 138, కోవెలకుంట్ల 75, నందికొట్కూరు 40, నంద్యాల 206, పత్తికొండ 79, ఎమ్మిగనూరులో 52 కేసులు పరిష్కారమయ్యాయి.  132 రహదారి ప్రమాద కేసులు పరిష్కరించి రూ.8.45 కోట్ల పరిహారాన్ని బాధితులకు ఇప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని