logo

జులై 1న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ

జులై 1న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.

Published : 28 Jun 2024 04:47 IST

జడ్పీ సీఈవో, డీఆర్డీఏ, మెప్మా పీడీలతో సమావేశమైన జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జులై 1న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. జులై 1న ఉదయం 6 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారులకు ఇంటి వద్దే నగదును అందించాలని ఆదేశించారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 గృహాల చొప్పున మ్యాపింగ్‌ చేసుకోవాలన్నారు. మొత్తం నాలుగు రకాల కేటగిరీ పింఛనుదారుల్లో 11 సబ్‌ కేటగిరీలకు చెందినవారికి మొత్తం రూ.7 వేలు అందజేయాలన్నారు. శనివారం బ్యాంకుల ద్వారా డ్రా చేసుకొని భద్రపర్చుకుని సోమవారం ఉదయం నుంచి మొదలుపెట్టి, అదే రోజు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కింద 2,45,229 మందికి రూ.167.34 కోట్ల పంపిణీ చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. సీఎస్‌ వీడియో కాన్ఫరెన్సు అనంతరం ఆమె జిల్లా అధికారులతో మాట్లాడారు.  కాన్ఫరెన్సులో జడ్పీ సీఈవో నాసర రెడ్డి, డీఆర్డీఏ పీడీ సలీంబాషా, మెప్మా పీడీ నాగశివలీల పాల్గొనారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని