logo

తెలుగు జాతి గుర్తుంచుకునే గొప్ప వ్యక్తి రామోజీరావు

తెలుగు జాతి సగర్వంగా గుర్తుంచుకునే గొప్ప వ్యక్తి రామోజీరావు అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలులోని నరసింహరెడ్డి నగర్‌లో గురువారం నిర్వహించిన రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభకు ఆయన హాజరై మాట్లాడారు.

Published : 28 Jun 2024 04:37 IST

నివాళి అర్పిస్తున్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేవీ సుబ్బారెడ్డి, డాక్టర్‌ శంకర్‌శర్మ

కర్నూలు గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగు జాతి సగర్వంగా గుర్తుంచుకునే గొప్ప వ్యక్తి రామోజీరావు అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలులోని నరసింహరెడ్డి నగర్‌లో గురువారం నిర్వహించిన రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మీడియా మొఘల్‌ రామోజీరావు మరణం పత్రిక రంగానికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త కేవీ సుబ్బారెడ్డి, డాక్టర్‌ శంకర్‌శర్మ, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని