logo

రాతివనాల్లో బాలకృష్ణ స్టెప్పులు

ఓర్వకల్లు సమీపంలోని రాతివనాల్లో గురువారం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సినిమా షూటింగ్‌ నిర్వహించారు. రెండు రోజులపాటు పలు సన్నివేశాలు జరుగనున్నట్లు సమాచారం.

Published : 28 Jun 2024 04:35 IST

ఓర్వకల్లులోని రాతివనాల్లో చిత్రీకరణ బృందం 

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ఓర్వకల్లు సమీపంలోని రాతివనాల్లో గురువారం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సినిమా షూటింగ్‌ నిర్వహించారు. రెండు రోజులపాటు పలు సన్నివేశాలు జరుగనున్నట్లు సమాచారం. సితారా ఎంటర్‌ప్రైజెస్‌ ప్రొడక్షన్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా, బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, ప్రత్యజ్ఞజ్వాలా కథానాయికగా ఎన్‌బీకే 109 నిర్మిస్తున్న సినిమాలో పాటను, కొన్ని విలన్‌ సీన్లను చిత్రీకరించారు. బాలకృష్ణ తన అనుచరులకు గన్‌ ఫైరింగ్‌ నేర్పించే విధానాన్ని, ఫైట్‌ సీన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించారు. షూటింగ్‌ విరామ సమయంలో డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, తుగ్గలి నాగేంద్ర కలిశారు. బాలకృష్ణ సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం మండలంలో తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కానీ అభిమానులను లోపలకు వెళ్లనీయకుండా కర్నూలు గ్రామీణ సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్సై రాజారెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని