logo

నిత్య కృషీవలుడు రామోజీరావు

రామోజీరావు నిత్య కృషీవలుడని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. రామోజీరావు సంస్మరణ సభ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు.

Updated : 28 Jun 2024 05:39 IST

ఈటీవీ ఉర్దూ ఛానల్‌ ప్రారంభోత్సవంలో రామోజీరావుతో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి ఫరూక్‌ (పాతచిత్రం) 

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : రామోజీరావు నిత్య కృషీవలుడని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. రామోజీరావు సంస్మరణ సభ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. పత్రికా అధిపతిగా తెలుగుకు వెలుగులు అద్దారని కొనియాడారు. ప్రజల అభ్యున్నతి కోసం నిత్యం శ్రమించిన రామోజీరావు తెలుగు రాష్ట్రాలపై తనదైన ముద్రను వేశారన్నారు. ఈసందర్భంగా ఫరూక్‌.. ఈటీవీ ఉర్దూ ఛానల్‌ ప్రారంభం సందర్భంలో సీఎం చంద్రబాబునాయుడు, తాను రామోజీరావుతో కలిసున్న చిత్రాన్ని విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని