logo

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

నంద్యాలలో సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి దివ్యాంగులు గురువారం క్షీరాభిషేకం చేశారు. స్థానిక శ్రీనివాససెంటర్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద సీఎంతో పాటు మంద కృష్ణమాదిగ చిత్రపటాలకు వారు పాలతో అభిషేకం చేశారు.

Published : 28 Jun 2024 04:32 IST

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న దివ్యాంగులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : నంద్యాలలో సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి దివ్యాంగులు గురువారం క్షీరాభిషేకం చేశారు. స్థానిక శ్రీనివాససెంటర్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద సీఎంతో పాటు మంద కృష్ణమాదిగ చిత్రపటాలకు వారు పాలతో అభిషేకం చేశారు. దివ్యాంగుల పింఛను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్‌ శ్యాంసుందర్‌లాల్, మాదిగ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు బెనర్జీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని