logo

నంద్యాల బాలికకు లాసెట్‌లో 9వ ర్యాంకు

నంద్యాల పట్టణం ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన తొమ్మండ్రు గురు హర్షశ్రీ గురువారం ప్రకటించిన ఏపీ లాసెట్‌ ఫలితాల్లో ప్రతిభ చూపింది. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించింది.

Published : 28 Jun 2024 04:30 IST

గురు హర్షశ్రీ 

రైతునగరం (నంద్యాల), న్యూస్‌టుడే : నంద్యాల పట్టణం ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన తొమ్మండ్రు గురు హర్షశ్రీ గురువారం ప్రకటించిన ఏపీ లాసెట్‌ ఫలితాల్లో ప్రతిభ చూపింది. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించింది. హర్షశ్రీ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ జూనియర్‌ కళాశాలలో 2022- 24లో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ చదివింది. ఇంటర్‌లో 991 మార్కులు సాధించి తెలంగాణలో మూడో స్థానంలో నిలిచింది. ఈనెల 3న తెలంగాణలో నిర్వహించిన లాసెట్‌లో కూడా హర్షశ్రీకి 71వ ర్యాంకు రావడం విశేషం. హర్షశ్రీ గతేడాది పంజాబ్‌లోని పటియాలలో జరిగిన ఎన్‌సీసీ నేషనల్‌ క్యాంప్‌లో పాల్గొని బంగారు పతకం సాధించింది. అనంతరం ఎన్‌సీసీ పరీక్షలో బి సర్టిఫికెట్‌ అందుకుంది. భవిష్యత్తులో లా డిగ్రీ పూర్తిచేసి జ్యూడీషియల్‌ సర్వీసెస్‌లో చేరడమే లక్ష్యమని ఈ విద్యార్థిని చెబుతోంది. హర్షశ్రీ తల్లి గోస్పాడు మండలం పార్వతీపురం ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా, తండ్రి గురుప్రసాద్‌ నంద్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని