logo

ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోండి : బుడ్డా

తెదేపా, జనసేన, భాజపా నాయకులు, బూత్‌ కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకోవాలని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సూచించారు.

Published : 27 Jun 2024 02:11 IST

విజయోత్సవ ర్యాలీలో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే : తెదేపా, జనసేన, భాజపా నాయకులు, బూత్‌ కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకోవాలని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సూచించారు. సున్నిపెంటలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే బుడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు శ్రీశైలం మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో తెదేపా నాయకులు యుగంధర్‌రెడ్డి, రామలింగారెడ్డి, కాతా రామిరెడ్డి, అడుసుమల్లి సుబ్బారావు, బెంజిమెన్, నాగేళ్ల సురేశ్, భాజపా నాయకులు సోమిశెట్టి మల్లికార్జున, గెల్లి వెంకటేశ్వర్లు, నల్లబోతుల మల్లికార్జున, జనసేన నాయకులు సురేంద్ర, నాగసాయి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని