logo

తెదేపా మహిళా నేత హత్యకేసులో కిరాయి హంతకుల హస్తం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ తెదేపా మహిళా నేత అట్ల శ్రీదేవి హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published : 27 Jun 2024 02:10 IST

పోలీసు జాగిలంతో సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీసులు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ తెదేపా మహిళా నేత అట్ల శ్రీదేవి హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులు ఆమెను హత్య చేసేందుకు కిరాయి ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. నలుగురు కిరాయి ముఠా సభ్యులు హత్యలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. వీరిలో ఒకరు గతంలో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. వివాహితను ప్రేమించిన ఆయన తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఆమె భర్తను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు. మరొకరు రుద్రవరం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నారు. వారితో పాటు మరో ఇద్దరు డబ్బు కోసం ఈ హత్య ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం. హత్య కేసులో కీలక సమాచారం సేకరించే క్రమంలో భాగంగా బుధవారం పోలీసు జాగిలాన్ని ఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయిదుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆస్తి తగాదాల కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

నిందితులుగా ఏవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు

అట్ల శ్రీదేవి హత్య కేసులో మొత్తం 15 మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. మొదటి ముద్దాయిగా ఏవీ గోపాల్‌రెడ్డి ఉండగా భార్య ఏవీ శిరీష, కుమారుడు కేదార్‌నాథరెడ్డితో పాటు, ఏవీ సుబ్బారెడ్డి, ఏవీ రుక్మిణమ్మ, జశ్వితరెడ్డి, చరిష్మారెడ్డి, జాహ్నవి రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, కొండారెడ్డి, హుస్సేన్‌రెడ్డితో పాటు మరో నలుగురు నిందితులుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని