logo

బాధ్యతల స్వీకరణ

రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బుధవారం అమరావతిలో బీసీ జనార్దన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

Published : 27 Jun 2024 02:05 IST

బాధ్యతలు స్వీకరించే ముందు పూజలో పాల్గొన్న బీసీ జనార్దన్‌రెడ్డి, సతీమణి ఇందిరమ్మ

రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బుధవారం అమరావతిలో బీసీ జనార్దన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయన మంత్రిగా సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. సతీమణి ఇందిరమ్మతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. సోదరులు బీసీ రాజారెడ్డి, బీసీ రామనాథరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు హాజరు కాగా ఆయన మంత్రి పదవి తీసుకొని కుర్చీలో ఆశీనుడయ్యారు. అనంతరం సంబంధిత అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రోడ్ల స్థితిగతుల గురించి తమకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రహదారులను బాగు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. 

 న్యూస్‌టుడే, బనగానపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు