logo

నదిలో ఇసుక దందా.. అధికారుల కళ్లకు మసక

నగరంలోని బండిమెట్ట గంగమ్మ ఆలయం సమీపంలో తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వి అక్రమ రవాణా చేస్తున్నారు.

Published : 27 Jun 2024 02:04 IST

నదిలో ఇసుక తవ్వుతూ..

నగరంలోని బండిమెట్ట గంగమ్మ ఆలయం సమీపంలో తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వి అక్రమ రవాణా చేస్తున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో నిత్యం నదిలో ఇసుకను తోడేస్తున్నారు. కొందరు పీకల్లోతు నీటిలో దిగి ఇసుక తీసి ఒడ్డున వేస్తున్నారు. మరికొందరు ఆ ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.  అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. నదిలో ఇసుక తవ్వకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

నదిలో ఇసుక తవ్వి ఒడ్డున వేస్తూ..

ప్రమాదకరంగా పీకల్లోతు నీటిలో దిగి..

 ఈనాడు, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని