logo

నాయకుడిగా కాదు.. ప్రజలకు సేవకుడిలాగే ఉంటా

ఎన్నికల ముందు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలాగా ఉంటానని, ప్రజలకు నాయకుడిని కాదని సేవకుడినని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.

Published : 27 Jun 2024 02:02 IST

 ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

బార్‌ అసోసియేషన్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలాగా ఉంటానని, ప్రజలకు నాయకుడిని కాదని సేవకుడినని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఆదోని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమావేశం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుందర్‌సింగ్‌ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే పార్థసారథి హాజరైయ్యారు. ఆదోని ప్రజలు స్వేచ్ఛగా జీవనం సాగించేలా జవాబుదారీ తనంతో పనిచేస్తానన్నారు. ఆదోనిలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటానని అన్నారు. లంచం తీసుకోనని, రౌడీయిజం చేయనన్నారు. ఆదోనిలో న్యాయవాదులు సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామన్నారు. కోర్టు భవనాల నిర్మాణం వేగంగా జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్, సీనియర్, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని