logo

క్రస్టుగేట్ల పనులు ప్రారంభం

కొత్త ప్రభుత్వ హయాంలో గాజులదిన్నె సంజీవయ్య సాగర్‌ జలాశయం ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం రూ.57 కోట్లు కేటాయిస్తున్నట్లు గొప్పగా చెప్పింది. ఆ తర్వాత కేవలం రూ.5 కోట్లతో గేట్ల పనులు ప్రారంభించారు.

Published : 26 Jun 2024 04:42 IST

నాలుగో గేటు వద్ద పనులు చేస్తున్న సిబ్బంది

గోనెగండ్ల, న్యూస్‌టుడే : కొత్త ప్రభుత్వ హయాంలో గాజులదిన్నె సంజీవయ్య సాగర్‌ జలాశయం ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం రూ.57 కోట్లు కేటాయిస్తున్నట్లు గొప్పగా చెప్పింది. ఆ తర్వాత కేవలం రూ.5 కోట్లతో గేట్ల పనులు ప్రారంభించారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారుడు మధ్యలోనే పనులు ఆపేశారు. దీంతో జలాశయం క్రస్టుగేట్ల పనితీరు అస్తవ్యస్తంగా మారింది. జలాశయానికి వరదనీరు వస్తే ఆనకట్టకు ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన ఈనెల 19న జలాశయాన్ని పరిశీలించారు. అడ్డదిడ్డంగా జరుగుతున్న పనులను చూసి అధికారులపై మండిపడ్డారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ప్రస్తుతం జలాశయం రెండు, నాలుగో క్రస్టుగేట్ల వద్ద పనులు ప్రారంభమయ్యాయి. స్టాఫ్‌లాక్‌ గేటు ద్వారా నూతన గేట్లను సిద్ధం చేస్తున్నారు. నూతన గేట్లకు రోప్‌ కనెక్షన్లు తదితరాలు నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ శైలేశ్వర్‌ తెలిపారు. మరో 20 రోజుల్లో ప్రాజెక్టుకు గేట్ల పనులు పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని