logo

వైకాపా కార్యాలయాలకు తాఖీదులు

కర్నూలు నగరంతోపాటు ఆదోని పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాలకు అధికారులు తాఖీదులు జారీ చేశారు. ఆదోనిలో పురపాలక పట్టణ విభాగం ఆధ్వర్యంలో   నోటీసులు జారీ చేశారు.

Published : 26 Jun 2024 04:40 IST

ఆదోనిలో వైకాపా నేత ఎర్రిస్వామికి తాఖీదులు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది

ఈనాడు-కర్నూలు, ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: కర్నూలు నగరంతోపాటు ఆదోని పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాలకు అధికారులు తాఖీదులు జారీ చేశారు. ఆదోనిలో పురపాలక పట్టణ విభాగం ఆధ్వర్యంలో   నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం కార్యాలయానికి వెళ్లిన సచివాలయ ఉద్యోగులు భవన లీజుదారుడైన వైకాపా నాయకుడు ఎర్రిస్వామికి తాఖీదులు అందజేశారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. నోటీసుల జారీపై రెండు రోజులుగా హైడ్రామా  నడిచింది. వైకాపా కార్యాలయానికి అనుమతులు లేని విషయం బయటకు తెలిసినా చర్యలు తీసుకొనేందుకు అధికారులు ముందుకు రాకపోవడంతో సచివాలయ ఉద్యోగులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.

ఇలా అందుకుని.. అలా సమాధానం పంపి

కర్నూలు నగరంలో వైకాపా కార్యాలయ నిర్మాణానికి సంబంధించి నిబంధనల ఉల్లంఘనలపై నగరపాలక అధికారులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలికి మంగళవారం తాఖీదులు జారీ చేశారు. 24వ తేదీన జారీ చేసినట్లుగా నోటీసులో పేర్కొన్నప్పటికీ ఆ లేఖను మంగళవారం మధ్యాహ్నమే ఇవ్వడం గమనార్హం. నోటీసులు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే వైకాపా జిల్లా అధ్యక్షురాలు ఎస్‌.సత్యనారాయణమ్మ ఐదు పేజీల సమాధానాన్ని కమిషనర్‌కు పంపారు. నోటీసులోని అంశాలను ముందుగానే వైకాపా పెద్దలకు లీక్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఖాళీ స్థలం పన్ను చెల్లించలేదని అధికారులు తమకు పంపిన నోటీసులో పేర్కొన్నారని, తాము రూ.25.09 లక్షల వీఎల్‌టీ చెల్లించామని లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి కార్పొరేషన్‌ అధికారులు సూచించిన మొత్తాన్ని చెల్లించలేదు. బకాయిలు ఉన్న విషయం ప్రస్తావించకుండా వీఎల్‌టీ చెల్లించామని పేర్కొనడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు