logo

అనుమతులు లేకుండానే నిర్మాణాలు

ఆదోని పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైకాపా కార్యాలయంపై తప్పనిసరిగా చర్యలుంటాయని ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి స్పష్టం చేశారు.

Published : 26 Jun 2024 04:35 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే డా.పార్థసారథి

ఆదోని మార్కెట్, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైకాపా కార్యాలయంపై తప్పనిసరిగా చర్యలుంటాయని ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి స్పష్టం చేశారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.కోట్ల విలువ చేసే ఉద్యోగులకు చెందిన పాత ఎన్జీవో భవనాన్ని రూ.40 లక్షలకు 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకోవడమంటే ఇలాంటి వింత మరొకటి ఉండదన్నారు. లీజుకు రాసిచ్చిన నాటి అసోసియేషన్‌ ఉద్యోగి తాజాగా పదవీ విరమణ పొందారని తెలిపారు. లీజుకు తీసుకున్న భవనాన్ని కూల్చి ఆ స్థలంలో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ తరహాలో నిర్మించిన వైకాపా కార్యాలయంలో సెటిల్‌మెంట్లు, జూదం వంటి కార్యాకలాపాలను నిర్వహించారని ఆరోపించారు. అక్రమాలను కప్పిపుచ్చేందుకు వైకాపా నేతలకు సహకరించిన ఉద్యోగులపై సైతం చర్యలు ఉంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని