logo

కళాశాల ప్రిన్సిపల్‌ సస్పెన్షన్‌

పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎం.సింహాద్రిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

Published : 26 Jun 2024 04:33 IST

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే : పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎం.సింహాద్రిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. సిబ్బందిని వేధించడంతో పాటు వివిధ కారణాలతో ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ కళాశాలల కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సింహాద్రిపై గతేడాది నవంబరు 12న అప్పటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపై విచారణ చేసి వేటేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని