logo

ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయం

శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. ఇక్కడ వసతుల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు.

Published : 26 Jun 2024 04:07 IST

సమీక్షిస్తున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. ఇక్కడ వసతుల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. శ్రీశైలంలోని దేవస్థానం పరిపాలనా భవనంలో ఈవో డి.పెద్దిరాజు, ఆయా విభాగాల ఏఈవోలు, పర్యవేక్షకులతో కలిసి మంగళవారం దేవస్థానం అభివృద్ధిపై సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారన్నారు. రద్దీకి అనుగుణంగా క్షేత్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. వారాంతపు సెలవులు, రద్దీ రోజుల్లో క్షేత్ర పరిధిలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని క్షేత్రం అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. దేవస్థానం సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. ఈవో పెద్దిరాజు దర్శనం, వసతి తదితర ఏర్పాట్లను వివరించారు. ఈ సమావేశంలో డీఈవో రమణమ్మ, ఈఈ రామకృష్ణ, మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని