logo

అక్షర తేజం రామోజీరావు

తెలుగు జాతి గర్వించే అక్షర తేజం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అని ఎంపీడీవో రఘురామ్‌ అన్నారు. ఉయ్యాలవాడ మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Published : 26 Jun 2024 04:04 IST

నివాళి అర్పిస్తున్న ఎంపీడీవో రఘురామ్, కార్యాలయ సిబ్బంది

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే : తెలుగు జాతి గర్వించే అక్షర తేజం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అని ఎంపీడీవో రఘురామ్‌ అన్నారు. ఉయ్యాలవాడ మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు  భాష పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. రామోజీరావు  నిత్య జీవన శైలిలో ఉన్న సమయపాలన, క్రమశిక్షణ, నిరాడంబరతను ప్రతి పౌరుడు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈవోఆర్డీ మహేంద్రరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ ప్రనీత్‌ కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సాంకేతిక సహాయకులు ఉన్నారు.

27న సంస్మరణ సభ

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు అరుదైన వ్యక్తి అని,  కర్నూలు నగరంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగరూరు రాఘవేంద్ర, కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. కర్నూలు నగరంలోని నరసింహారెడ్డి నగర్‌లో రాఘవేంద్ర మినీ బ్లాంకెట్‌ హాలులో 27వ తేదీన సంస్మరణ సభ నిర్వహించనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఫొటో, వీడియో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రామస్వామి అధ్యక్షత వహించారు. కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలన్నారు. బీసీ చైతన్య సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శేషుఫణి, భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీనాయుడు, గోపాల్, శివయ్య, శ్రీను పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని