logo

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును స్వాగతిస్తాం

వైకాపా ప్రభుత్వం వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన 20 నెలల తర్వాత తెదేపా ప్రభుత్వం తొలి మంత్రి మండలి సమావేశంలోనే ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చడాన్ని స్వాగతిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Published : 26 Jun 2024 04:01 IST

ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న సోమిశెట్టి, తెదేపా నాయకులు 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన 20 నెలల తర్వాత తెదేపా ప్రభుత్వం తొలి మంత్రి మండలి సమావేశంలోనే ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చడాన్ని స్వాగతిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన తెదేపా కర్నూలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర, రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే బషీర్, పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ధరూర్‌ జేమ్స్‌ తదితరులు మంగళవారం ఎన్టీఆర్‌ ప్రతిమకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హెల్త్‌ యూనివర్సిటీని పేరు మార్చడం వల్ల ఇప్పటి వరకు చదువుకుని ధ్రువపత్రాలు పొందిన విద్యార్థులు ఇబ్బందులు పడతారని అనేక మంది వైకాపా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించి ఎన్టీఆర్‌ పేరును తొలగించిందన్నారు. ఇక్కడ విద్యనభ్యసించి విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థులకు కళాశాల పేరు మారడంతో సాంకేతికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా తెదేపా ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాల వెంకటేశ్వరరెడ్డి, ఆదాము, భాస్కర్‌ పాల్గొన్నారు.

యావజ్జీవ శిక్షపడేలా కేసులు నమోదు చేయాలి

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు పేరుతో ప్రజల ఆస్తులు స్వాహా చేసిన జగన్‌రెడ్డికి యావజ్జీవ శిక్ష పడేలా ప్రభుత్వం కేసులు నమోదు చేయాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండు చేశారు.  తెదేపా కర్నూలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌తో కలిసి మాట్లాడారు. 2019లో ఒక్క అవకాశం పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను కాజేసేందుకు కుట్రలు చేసి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను తీసుకొచ్చారన్నారు. ఆయనపై కేసులు నమోదు చేసి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐదేళ్ల పాలనలో ఆక్రమించిన భూములు సుమారు రూ.30 వేల కోట్ల వరకు ఉంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు