logo

Kurnool: సమస్యలపై గళం విప్పిన సభ్యులు

ఆదోని పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై కౌన్సిల్ సభ్యులు గళమెత్తారు.

Published : 29 Jun 2024 17:14 IST

ఆదోని మార్కెట్: ఆదోని పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై కౌన్సిల్ సభ్యులు గళమెత్తారు. శనివారం ఛైర్‌పర్సన్‌ శాంతా అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో మొత్తం 37 అంశాల ఏజెండాను ఆమోదించారు. అనంతరం సమస్యలపై అధికారులు గట్టిగ నిలదీశారు. తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని తుంగభద్ర దిగువ కాలువకు నీరు వదిలితే తప్ప పట్టణంలో నీటి సమస్య తీరేలా లేదని ముందస్తు ప్రణాళిక ఏం చేశారని ప్రశ్నించారు. ప్రతినెల సమావేశాలలో వార్డు సమస్యలు తెలిపినా అధికారులు పట్టించుకోవడంలేదని నిలదీశారు. మురుగు సమస్యలు వేధిస్తున్నాయని, శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు కొరత అధికంగా ఉందని వీటిపై దృష్టి సారించకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. ఛైర్‌పర్సన్‌ జోక్యం చేసుకొని సమస్యలను విభాగాల వారిగా నమోదు చేసుకొని పరిష్కార పురోగతిని సభ్యులకు వివరించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని