logo

మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ రఘు అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు.

Published : 28 Jun 2024 12:20 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ రఘు అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజెండాలోని 29 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ చెప్పగా.. కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మూడు నెలల తర్వాత కౌన్సిల్ నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు  స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సమావేశంలో  కమిషనర్ గంగిరెడ్డి, పాలక మండలి సభ్యులు, మున్సిపల్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని