logo

Kurnool: ప్రజా సమస్యలపై దృష్టి సారించండి

పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిబ్బంది దృష్టి సారించాలని నగర పంచాయతీ ఛైర్మన్ సీహెచ్ చలంరెడ్డి పేర్కొన్నారు.

Published : 29 Jun 2024 21:28 IST

బేతంచెర్ల: పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిబ్బంది దృష్టి సారించాలని నగర పంచాయతీ ఛైర్మన్ సీహెచ్ చలంరెడ్డి పేర్కొన్నారు. శనివారం బేతంచెర్ల పట్టణంలోని నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెదేపా వార్డు కౌన్సిలర్లు అంజి, రాంగోపాల్, నంద్యాల కుమారి, విజయలక్ష్మి ఆయా వార్డుల్లో నెలకొన్న తాగునీరు, మరుగుదొడ్లు, వీధి దీపాల సమస్యలను ఛైర్మన్‌ దృష్టికి తెచ్చారు. వీలైనంత త్వరగా ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు. దుర్గాపేట, సంజీవనగర్, వడ్డేపేట కాలనీల్లో నూతనంగా నిర్మించిన మరుగు దొడ్లకు కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి వినియోగంలోకి తేవాలని కోరారు. హనుమాన్ నగర్ కాలనీలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ముచ్చట్ల నుంచి బేతంచెర్ల తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్మన్ చలంరెడ్డి తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే ముందస్తు సమాచారంతో ఎస్సై శివశంకర్ నాయక్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని