logo

గుంటూరు- సికింద్రాబాద్ రైలు ఔరంగాబాద్ వరకు పొడిగింపు

గుంటూరు-సికింద్రాబాద్ రైలును ఆదివారం నుంచి ఔరంగాబాద్ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య  జోనల్ రైల్వే మెంబర్ జుబేర్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated : 30 Jun 2024 12:14 IST

రైతునగరం (నంద్యాల):  గుంటూరు-సికింద్రాబాద్ రైలును ఆదివారం నుంచి ఔరంగాబాద్ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య  జోనల్ రైల్వే మెంబర్ జుబేర్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక నుంచి గుంటూరు-ఔరంగాబాద్‌కు  రైలు నెం. 17253 మధ్యాహ్నం 12.15 గంటలకు నంద్యాల రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఔరంగాబాద్-గుంటూరు రైలు నెం. 17254 మధ్యాహ్నం 3.05 నిముషాలకు నంద్యాల రైల్వే స్టేషన్‌కు వస్తుందన్నారు. ఔరంగాబాద్ నుంచి షిర్డీ 100 కి.మీ. ఉంటుందని, నంద్యాల ప్రాంత ప్రజలు షిర్డీ వెళ్లడానికి ఇదొక మంచి అవకాశమన్నారు. ఈ రైలును వచ్చే ఏడాది నాగర్సోల్ వరకు పొడగించనున్నామని, అక్కడ నుంచి షిర్డీ 40 కి.మీ. ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు