logo

Kurnool: వేతన బకాయిలు విడుదల చేయాలి

నంద్యాల జిల్లాలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు విడుదల చేయాలని నాయకులు కోరారు.

Published : 01 Jul 2024 21:34 IST

రైతునగరం (నంద్యాల): నంద్యాల జిల్లాలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు విడుదల చేయాలని నాయకులు కోరారు. బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు నాగరాజు, సలహాదారు లక్ష్మణ్ కోరారు. సోమవారం నంద్యాల వైఎస్సార్ సెంటనరీ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు జిల్లా కలెక్టర్ డా. శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో పని చేసే ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు గత 18 నెలల నుంచి వేతనాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీరికి కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. నాయకులు నాగేశ్వరరెడ్డి, లత, ప్రభావతి, మద్దిలేటి, రామ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని