logo

Kurnool: మహానందిలో చిరుత సంచారం

నంద్యాల జిల్లా మహానంది పుణ్య క్షేత్రం దేవస్థానం గోశాల వద్ద చిరుత పులి సంచరించింది.

Published : 26 Jun 2024 15:40 IST

మహానంది: నంద్యాల జిల్లా మహానంది పుణ్య క్షేత్రం దేవస్థానం గోశాల వద్ద చిరుత పులి సంచరించింది. ఈ ఘటన వేకువజామున దేవస్థానం నిఘా కెమెరాల్లో నిక్షిప్తమయింది. గత పది రోజులకు పైగా మహానంది దేవస్థానం పరిధిలోని విద్యుత్ ఉపకేంద్రం, గోశాల, కొత్త కాలనీ సమీపంలోని ఎర్రగుంత, పార్వతీపురం కాలనీలోని మహానంది క్షేత్రం- గాజులపల్లె ఆర్ఎస్ మధ్య ఉన్న రహదారిలో చిరుత సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ శాఖ అధికారులు ఇతర ప్రాంతాల్లో వదిలేయడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో యాత్రికులు భక్తులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బుధవారం చిరుత సంచరించిందన్న వాస్తవిక సమాచారాన్ని అందుకున్న అటవీ శాఖ వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని