logo

Kurnool: అభిమానితో కలిసి బాలయ్య భోజనం

అభిమానితో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

Updated : 28 Jun 2024 20:33 IST

ఆదోని మార్కెట్: అభిమానితో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్స్‌లో బాలయ్య 109వ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదోని నందమూరి యువసేన సేవా సంస్థ అధ్యక్షుడు సజాద్‌కు బాలయ్య కబురు పంపారు. దీంతో సజాద్ భార్య, కుమారుడితో కలిసి శనివారం మధ్యాహ్నం షూటింగ్‌ ప్రాంతంలో బాలకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా అభిమాని కుటుంబంతో కలిసి బాలయ్య భోజనం చేశారు. ఓ సాటి అభిమానిని ఎలా గౌరవిస్తారో బాలయ్యే ఇందుకు ఉదాహరణ అని సజాద్ ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని