logo

లోగుట్టు ఏంటి?

అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులతో ఠాణా సిబ్బంది అంటకాగారనే అవినీతి మరకలు, ఉన్నతాధికారుల వేధింపులే శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

Published : 03 Jul 2024 02:12 IST

అశ్వారావుపేట, అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులతో ఠాణా సిబ్బంది అంటకాగారనే అవినీతి మరకలు, ఉన్నతాధికారుల వేధింపులే శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు ఎస్సై సెల్‌ఫోన్‌ను స్వాధీనపరచుకున్నారు. తనపై వేధింపులు, సిబ్బంది నుంచి ఎదురైన అవమానాలను సెల్‌ఫోన్‌లో ఎస్సై రికార్డు చేసినట్టు సమాచారం.  కొంతకాలం క్రితం జరిగిన ఓ సెటిల్‌మెంట్‌పై ఇద్దరు పోలీసు అధికారులను ఉన్నతాధికారులు మందలించినట్లు తెలుస్తోంది. అశ్వారావుపేట ఠాణాలో కొందరు సిబ్బంది కలెక్షన్‌ ఏజెంట్లుగా మారారని, పంపకాల్లో తేడాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే సీఐ జితేంద్రరెడ్డి పలుమార్లు మెమోలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మనస్తాపంతోనే ఎస్సై ఆత్మహత్యకు యత్నించారనే    వాదనలు వ్యక్తమవుతున్నాయి. 

ఆ నలుగురు వీఆర్‌కు ఎటాచ్డ్‌..!

ఎస్సై ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసులపై  ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి వీఆర్‌కు ఎటాచ్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు   ఉన్నతాధికారులు అధికారిక    ప్రకటన విడుదల చేయలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని