logo

మిలీషియా సభ్యుడు లొంగుబాటు

భద్రాచలం ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఎదుట మంగళవారం మావోయిస్టు మిలీషియా సభ్యుడు మడవి జోగా లొంగిపోయాడు.

Published : 03 Jul 2024 02:11 IST

చర్ల, న్యూస్‌టుడే: భద్రాచలం ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఎదుట మంగళవారం మావోయిస్టు మిలీషియా సభ్యుడు మడవి జోగా లొంగిపోయాడు. సుక్మా జిల్లా జెట్టిపాడుకు చెందిన జోగా రెండేళ్ల కిందట మావోయిస్టు పార్టీకి చెందిన పుట్టపాడు మిలీషియా కమాండర్‌ మడకం దేవ దగ్గర సభ్యుడుగా చేరి పార్టీలో మిలీషియా సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చక జోగా లొంగిపోయారని ఏఎస్పీ వివరించారు. జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ‘ఆపరేషన్‌ చేయూత’లో భాగంగా మావోయిస్టు నాయకులు, దళ సభ్యులు లొంగిపోతున్నారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ నుంచి జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వం తరపున అన్ని పునరావాసాలను కల్పిస్తామని ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో ఏఎస్పీతోపాటు సీఐ రాజువర్మ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని