logo

Suraj Revanna: సూరజ్‌ రేవణ్ణ.. అమావాస్య రోజు ఎర్ర చీర, నల్లగాజులతో సింగారం!

ఒక యువకుడిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణ అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని, నల్లగాజులు వేసుకునేవాడని ఆయనపై కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు గుర్తించారు.

Updated : 27 Jun 2024 10:10 IST

సూరజ్‌ రేవణ్ణ 

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: ఒక యువకుడిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణ అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని, నల్లగాజులు వేసుకునేవాడని ఆయనపై కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే అతనిపై ఫిర్యాదు చేసిన బాధితుడు ఈ విషయాలను వెల్లడించాడు. తనకు 2019 ఎన్నికల సందర్భంలో అరకలగూడులో సూరజ్‌ పరిచయం అయ్యాడని, అప్పుడు తన ఫోన్‌ నంబరు తీసుకుని, విజిటింగ్‌ కార్డు ఇచ్చాడని తెలిపాడు. నిత్యం గుడ్‌మార్నింగ్‌తో పాటు ప్రేమ చిహ్నాలు పంపించేవాడన్నారు. తనను ఫాంహౌస్‌కు పిలిపించుకుని, కాళ్లు ఒత్తమని కోరాడని, ఆ తర్వాత తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణ అధికారులకు అతను వివరించాడు. చీరకట్టుకుని, గాజులు వేసుకున్న చిత్రాలు అతని సెల్‌ఫోన్లో ఉన్నాయని తెలిపాడు. ఆ ఫోన్‌ జప్తు చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు.

బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో 2018 మార్చి 4న సూరజ్‌- సాగరిక రమేశ్‌ల వివాహం జరిగింది. వివాహమైన కొద్ది నెలలకే ఆయన భార్య నుంచి దూరమయ్యారు. భార్యతోనూ అసహజ లైంగిక క్రియకు ప్రయత్నించడంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుందని న్యాయవాది కుమార్‌ ఎ.పాటిల్‌ గుర్తుచేశారు. వారిద్దరికీ కుటుంబ న్యాయస్థానం మూడేళ్ల కిందటే విడాకులు మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు