logo

శిరసి కళాకారిణి ఘనత భళా

ప్రపంచ శాంతికి యక్షగానం పేరిట తొమ్మిది విధానాల్లో ప్రదర్శనలు ఇస్తున్న శిరసికి చెందిన కళాకారిణి తులసి హెగ్డే (16) పేరును లండన్‌కు చెందిన ప్రఖ్యాత ‘వరల్డ్‌ రికార్డు సంస్థ’ తన జాబితాలో చేర్చింది.

Published : 05 Jul 2024 03:48 IST

కార్వార, న్యూస్‌టుడే: ప్రపంచ శాంతికి యక్షగానం పేరిట తొమ్మిది విధానాల్లో ప్రదర్శనలు ఇస్తున్న శిరసికి చెందిన కళాకారిణి తులసి హెగ్డే (16) పేరును లండన్‌కు చెందిన ప్రఖ్యాత ‘వరల్డ్‌ రికార్డు సంస్థ’ తన జాబితాలో చేర్చింది. శిరసి మారికాంబ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తులసి హెగ్డే మూడేళ్ల వయసు నుంచే యక్షగానంపై ఆసక్తి చూపింది. ఆమె ఐదున్నరేళ్ల నుంచి ప్రపంచ శాంతిని ప్రబోధిస్తూ రూపకాన్ని ప్రదర్శిస్తోంది.

పౌరాణిక వ్యాఖ్యలతో తొమ్మిది రూపకాలను ఆవిష్కరించడం ప్రత్యేకం. దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల్లో కలిపి ఇప్పటి వరకు 850కు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. సీనియరు కళాకారులతో కలిపి పలు ప్రదర్శనల్లో ప్రతిభను ప్రదర్శించింది. బాలే తరహాలో మునివేళ్లపై నిలబడి చేసే ప్రదర్శన మినహా అన్ని కళా విధానాలను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కర్ణాటక బాల వికాస అకాడమీ ఇచ్చే బాల గౌరవ పురస్కారంతో పాటు, పలు పురస్కారాలను, అవార్డులను సొంతం చేసుకుంది. తన ప్రతిభతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీనీ ఆమె ఒక సారి కలిసే అవకాశాన్ని దక్కించుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని