logo

అర్థవంతంగా కాంతరాజు నివేదిక

వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్‌ అధ్యక్షుడు కాంతరాజు ఇచ్చిన సామాజిక, ఆర్థిక, విద్యా సంబంధింత నివేదికను ప్రభుత్వం స్వీకరించిందని సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్‌ తంగడగి స్పష్టం చేశారు.

Updated : 03 Jul 2024 06:27 IST

సమావేశంలో మాట్లాడుతున్న శివరాజ్‌ తంగడగి

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్‌ అధ్యక్షుడు కాంతరాజు ఇచ్చిన సామాజిక, ఆర్థిక, విద్యా సంబంధింత నివేదికను ప్రభుత్వం స్వీకరించిందని సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్‌ తంగడగి స్పష్టం చేశారు. నివేదికలోని అంశాలకు నిబద్ధత ఉండడంతో దాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారని వివరించారు. మంత్రి మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఏ సముదాయానికీ నష్టం వాటిల్లకుండా అందులోని సిఫార్సులను అమలు చేస్తామని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఈ నివేదికను ఉద్దేశపూర్వకంగా స్వీకరించలేదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగిన సమయంలో అందుకున్న నివేదికపై సమగ్రంగా చర్చించడం సాధ్యం కాలేదన్నారు. మంత్రి పదవిపై తనకు సంతృప్తి ఉందన్నారు. పార్టీపై నిష్ఠను గుర్తించి రెండుసార్లు పదవి ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాలని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని హోం మంత్రి డాక్టర్‌ పరమేశ్వర్‌ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు