logo

రౌతు లేని బండి రాజధానిలో సందడి

రాజధాని నగరంలో మెట్రో అభివృద్ధి పనుల జోరు వేగం పుంజుకుంది. చోదకుడి అవసరంలేని మెట్రో రైలు సంచార పరీక్షలను సంబంధిత విషయ నిపుణులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

Published : 03 Jul 2024 03:09 IST

నాజూకు మెట్రోకు పరీక్షలు

చోదకుడి అవసరంలేని మెట్రో.. పట్టాలపై పరుగులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాజధాని నగరంలో మెట్రో అభివృద్ధి పనుల జోరు వేగం పుంజుకుంది. చోదకుడి అవసరంలేని మెట్రో రైలు సంచార పరీక్షలను సంబంధిత విషయ నిపుణులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఆ రైలు నిర్వహణకు సంబంధించి బీఎంఆర్‌సీఎల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులకు చైనా నిపుణులు శిక్షణ ఇస్తున్నారు. నగరంలోని ఆర్‌.వి.రోడ్డు- బొమ్మనహళ్లి మధ్య 18.6 కిలోమీటర్ల పొడవునా ఈ నాజూకు వాహనం పరుగులు తీయనుంది. వీటిని చైనా మెట్రో రైలు కార్పొరేషన్‌ అందజేసిన విషయం తెలిసిందే. నెల రోజులుగా దాని పనితీరు గమనిస్తూనే ఉన్నారు. రైలు గరిష్ఠ వేగం, కుదుపుల అంశం, అత్యవసరంగా ఆగడానికి ఉపకరించే సాంకేతికత, సిగ్నల్‌ వ్యవస్థకు స్పందించే సెన్సర్లు, విద్యుత్తు సరఫరా తదితరాలను పరిశీలిస్తున్నామని బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు తెలిపారు. ఇప్పటికే 25 రోజులుగా ఇది పట్టాలపై పరుగులు తీస్తోంది. మరో 40 రోజులు పాటు పరీక్షలు కొనసాగుతాయి. ఈ యేడాది ఆఖరులోగానే ప్రజల సేవకు సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడించారు. చైనా నుంచి మరో ఆరు రైళ్లు దిగుమతి చేసుకుంటారు. అవి వచ్చాక ఏకకాలంలో పనితీరు సరిచూస్తారు. ఆర్‌.వి.రోడ్డు- బొమ్మనహళ్లి మధ్య మెట్రోరైలు ప్రారంభిస్తే ఐటీ ఉద్యోగులతో పాటు హోసూరు ప్రాంతం వారికి ఉపకరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని