logo

సూరజ్‌ కస్టడీ పెంపు

అసహజ లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలతో అరెస్టయిన ఎమ్మెల్సీ డాక్టర్‌ సూరజ్‌ రేవణ్ణను బుధవారం వరకు విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది.

Published : 02 Jul 2024 01:54 IST

సూరజ్‌ రేవణ్ణ

సదాశివనగర, న్యూస్‌టుడే : అసహజ లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలతో అరెస్టయిన ఎమ్మెల్సీ డాక్టర్‌ సూరజ్‌ రేవణ్ణను బుధవారం వరకు విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. కస్టడీ కాలం పూర్తి కావడంతో చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ముందు సూరజ్‌ను ప్రవేశపెట్టారు. కనీసం నాలుగు రోజులు విచారణకు అప్పగించాలని ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) కోరగా, న్యాయమూర్తి రెండు రోజులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. సూరజ్‌కు స్వర పరీక్ష, శిరోజాల పరీక్షలు చేయాలని పోలీసులు నిర్ణయించారు.


దర్శన్‌ తల్లి కన్నీరు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : హత్య కేసులో పరప్పన అగ్రహార కారాగారంలో చేరిన నటుడు దర్శన్‌ను అతని తల్లి మీనా తూగుదీప సోమవారం కలసి సాంత్వన వచనాలు పలికారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీశ్, సోదరుడు దినకర్‌ ఈ ములాఖత్‌లో ఆయనను కలుసుకున్నారు. కుమారుడి స్థితి చూసి మీనా కన్నీరు మున్నీరయ్యారు. తన కుమారుడ్ని దగ్గరకు తీసుకుని దర్శన్‌ కూడా రోధించాడు. జామీను, న్యాయపోరాటాలకు సంబంధించి భార్య, సోదరునితో ఆయన కొంత సమయం చర్చించారు. దర్శన్‌ను భేటీ అవుతామని పలువురు అభిమానులు కారాగారం దగ్గరకు రావడం, వారిని నియంత్రించడం పోలీసులు, భద్రత సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని