logo

కమలదండులోకి ఈశ్వరప్ప?

అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, లోక్‌సభ ఎన్నికల్లో కుమారుడు కాంతేశ్‌కు టికెట్‌ ఇవ్వలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప అలక పూనారు.

Published : 02 Jul 2024 01:45 IST

శివమొగ్గ, న్యూస్‌టుడే : అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, లోక్‌సభ ఎన్నికల్లో కుమారుడు కాంతేశ్‌కు టికెట్‌ ఇవ్వలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప అలక పూనారు. ఆ క్రమంలోనే ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో భాజపా ఆయనపై ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. మళ్లీ పార్టీలోకి రావాలని తనకు కబురు అందిందని ఈశ్వరప్ప సోమవారం ఇక్కడ విలేకరులకు వెల్లడించారు. టికెట్‌ ఇవ్వకుండా కొందరు నాయకులు అడ్డుపడటంతోనే తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేశానని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను పార్టీ పెద్దలే త్వరలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈశ్వరప్ప అసహనం కట్టలు తెంచుకున్న  విషయం తెలిసిందే. రాష్ట్రంలో కీలక పదవులన్నీ మాజీ ముఖమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప కుటుంబానికే భాజపా అధిష్ఠానం కట్టబెట్టడం సరికాదంటూ అప్పట్లో అభ్యంతరం ప్రకటించారు. అప్ప కుమారుడు రాఘవేంద్రను ఓడించడమే లక్ష్యంగా శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీకి దిగి, నిరాశకు లోనుకావడం ప్రస్తావనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని