logo

డిజిటల్‌ దాఖలాలూ సాక్ష్యాలే

నేర నియంత్రణకు, కొత్త నేరాలను అడ్డుకునేందుకు అమలులోకి వచ్చిన చట్టాలపై అన్ని ఠాణాల సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇచ్చామని హోం శాఖ మంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ వెల్లడించారు.

Published : 02 Jul 2024 01:43 IST

కొత్త చట్టమే ఇక చుట్టం: పరమేశ్వర్‌

 పరమేశ్వర్‌

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : నేర నియంత్రణకు, కొత్త నేరాలను అడ్డుకునేందుకు అమలులోకి వచ్చిన చట్టాలపై అన్ని ఠాణాల సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇచ్చామని హోం శాఖ మంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ వెల్లడించారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ డిజిటల్‌ దాఖలాలను ఇకపై సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. కొత్త చట్టాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేందుకు యాప్‌ను సిద్ధం చేశామన్నారు. ఈ చట్టాలను అమలు చేసిన అనంతరం ఎటువంటి ఫలితాలు వస్తాయో వేచి చూడడం తప్పనిసరి అన్నారు. ఇప్పటి నుంచి నమోదయ్యే అన్ని కేసులను కొత్త చట్టాలకు అనుగుణంగానే దాఖలా చేస్తారని తెలిపారు. త్వరలో కర్ణాటక విధానసభ ఎన్నికలు జరుగుతాయని మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బసవరాజ బొమ్మై చేసిన వ్యాఖ్యలను పరమేశ్వర్‌ ఖండించారు. సీటీ రవి మరో రకంగా మాట్లాడుతున్నారని, భాజపాలోనే నేతల మధ్య అవగాహన లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ పాలన కన్నా కాంగ్రెస్‌ హయాంలోనే ప్రజలకు ఎక్కువ ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. వాల్మీకి అభివృద్ధి మండలి కేసును సీబీఐ, ఈడీ, సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నేరం చేస్తే నాయకులైనా, అధికారులైనా శిక్ష అనుభవించవలసి ఉంటుందని అన్నారు.

రెండు కేసులు నమోదు..

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : దేశంలో నూతన భారతీయ నాగరిక సురక్షా చట్టం (బీఎన్‌ఎస్‌ఎస్‌) సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. కన్నడనాట దీని పరిధిలో తొలిసారిగా రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. ఆడుగూడి, హెచ్‌.ఎస్‌.ఆర్‌. లేఔట్‌ పోలీసుఠాణాల పరిధిలో దొంగతనాలకు సంబంధించి ఆ చట్టం 194వ నిబంధన కింద ఫిర్యాదులు నమోదు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని