logo

పరిశోధన కోసం పరుగు

వైద్య రంగంలో క్లినికల్‌ పరిశోధనలు మరింత ఎక్కువగా సాగాలని, పరిశోధనలను ప్రోత్సహించే విధంగా ఇండియన్‌ సొసైటీ ఫర్‌ క్లినికల్‌ పరిశోధన సంస్థ సహకారంతో ఆదివారం ఇక్కడ హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లోని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మైదానంలో రన్‌ ఫర్‌  పరిశోధన మారథాన్‌ చేపట్టారు.

Published : 01 Jul 2024 02:34 IST

మారథాన్‌కు హాజరైన నగరవాసులు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: వైద్య రంగంలో క్లినికల్‌ పరిశోధనలు మరింత ఎక్కువగా సాగాలని, పరిశోధనలను ప్రోత్సహించే విధంగా ఇండియన్‌ సొసైటీ ఫర్‌ క్లినికల్‌ పరిశోధన సంస్థ సహకారంతో ఆదివారం ఇక్కడ హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లోని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మైదానంలో రన్‌ ఫర్‌  పరిశోధన మారథాన్‌ చేపట్టారు. ఐదు, పది కిలోమీటర్ల మారథాన్‌లో వైద్యులు, వైద్య సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆరోగ్యం కోసం పరిశోధనలపై ప్రజలను చైతన్యం చేసేందుకు మారథాన్‌ చేపట్టినట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ సనీశ్‌ డేవిస్‌ తెలిపారు. క్లినికల్‌ పరిశోధనల వల్ల రోగికి సరైన వైద్యం అందించడం సాధ్యమవుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని