logo

కేంద్రానికి లేఖ రాశాం

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని మంత్రి డాక్టర్‌ శరణు ప్రకాశ్‌ పాటిల్‌ వెల్లడించారు.

Published : 01 Jul 2024 02:32 IST

డాక్టర్‌ శరణు ప్రకాశ్‌ పాటిల్‌

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని మంత్రి డాక్టర్‌ శరణు ప్రకాశ్‌ పాటిల్‌ వెల్లడించారు. తమ కళాశాలల్లో 15 శాతం సీట్లను ప్రవాస భారతీయులకు కేటాయించుకునేందుకు అవకాశం ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్‌ అధ్యక్షునికి రాసిన లేఖలో కోరామని చెప్పారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐలకు కేటాయించేందుకు 22 వైద్య కళాశాలల్లో 508 సూపర్‌ న్యూమెరరీ సీట్లను మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులకు సీట్లు కేటాయించడం ద్వారా ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. గత విద్యా సంవత్సరంలో 3450 మంది వైద్య విద్య కోర్సుల్లో చేరారని తెలిపారు. అందులో 85 శాతం (2929 సీట్లు) కర్ణాటక కోటా, 521 సీట్లను జాతీయ విద్యార్థులకు కేటాయించామని చెప్పారు. రాజస్థాన్, హరియాణ, పంజాబ్, హిమాచల ప్రదేశ్, పుదుచ్చేరి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 7-15 శాతం ఎన్‌ఆర్‌ఐకు కేటాయించారని గుర్తు చేశారు. ఈ విద్యార్థుల నుంచి తలా 75 వేల నుంచి లక్ష డాలర్ల ఫీజు ఆయా కళాశాలలకు వస్తుందని తెలిపారు. కర్ణాటకలో ఎన్‌ఆర్‌ఐ కోటాను ప్రైవేటు కళాశాలలు మాత్రమే కలిగి ఉన్నాయని చెప్పారు. ఒక్కో విద్యార్థి నుంచి ఏటా రూ.ఒక కోటి నుంచి రూ.2.5 కోట్ల ఫీజు వసూలు చేస్తున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్న సీట్ల నుంచి ఎన్‌ఆర్‌ఐలకు కేటాయిస్తే, స్థానికులు, పేద విద్యార్థులకు ఇబ్బంది ఎదురవుతుందన్నారు. ప్రత్యేకంగా సీట్లను సృష్టించే అధికారం వైద్య మండలి, ప్రాధికారలకు మాత్రమే ఉందని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని