logo

చందన చిత్రసీమకు అండగా నిలుస్తాం

కన్నడ చలన చిత్రాల నిర్మాణానికి, ఇతర ప్రాంతాల్లోనూ వాటిని ప్రదర్శించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

Published : 01 Jul 2024 02:21 IST

జ్యోతి వెలిగిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: కన్నడ చలన చిత్రాల నిర్మాణానికి, ఇతర ప్రాంతాల్లోనూ వాటిని ప్రదర్శించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కన్నడ చలనచిత్ర నిర్మాత సంఘం నూతన భవంతిని ఆదివారం ప్రారంభించి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు నిర్మాతల సంఘానికి సొంత భవంతి లేకపోవడంపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా చిత్ర నిర్మాతలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయాన్ని ఆశించలేదన్నారు. కేరళ ప్రభుత్వం తరహాలోనే కర్ణాటకలోనూ ప్రత్యేక ఓటీటీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. కన్నడ చిత్రాలన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఓటీటీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మైసూరులో ఫిలింసిటీని ప్రైవేటు సంస్థలు, కంపెనీల సహకారంతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీని నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే వంద ఎకరాలకు పైగా భూమిని కేటాయించిందని గుర్తు చేశారు. ‘చిత్రనగరి’ నిర్మాణం డాక్టర్‌ రాజ్‌కుమార్‌ కల అని తెలిపారు. నటుడు శివరాజ్‌ కుమార్, రాజ్యసభ సభ్యుడు జగ్గేశ్, సీనియరు నిర్మాత సా.రా.గోవిందు, మంత్రి భైరతి సురేశ్‌ పాల్గొన్నారు.

స్మరణిక అందజేస్తున్న సినీ ప్రముఖులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు