logo

చెన్నపట్టణ నుంచి అనసూయ పోటీ చేస్తారా?

చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరంటూ స్థానికుల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. తాను అక్కడి నుంచి పోటీ చేయనని మాజీ ఎంపీ డీకే సురేశ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

Updated : 01 Jul 2024 06:55 IST

రామనగర, న్యూస్‌టుడే: చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరంటూ స్థానికుల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. తాను అక్కడి నుంచి పోటీ చేయనని మాజీ ఎంపీ డీకే సురేశ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ కుమార్తె పోటీ చేస్తుందని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని సురేశ్‌ ఖండించారు. దళ్‌ నుంచి నిఖిల్‌ గౌడ, భాజపా నుంచి మాజీ మంత్రి యోగీశ్వర్‌ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. దళ్‌-భాజపా పొత్తు అభ్యర్థిగా దేవేగౌడ కుమార్తె అనసూయను బరిలో దించాలని దళపతులు యోచిస్తున్నారు. బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నుంచి భాజపా టికెట్‌పై ఆమె భర్త డాక్టర్‌ మంజునాథ్‌ ఇప్పటికే గెలుపొందారు. అభ్యర్థి ఎంపికపై ఇదే వారంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.


‘నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా’

మండ్య, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పేదలకు ఇళ్లు కేటాయించలేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. సిద్ధరామయ్య 2017లో స్లంబోర్డు తరఫున లక్ష ఇళ్లు, రాజీవ్‌ గాంధీ పథకం కింద 53 వేల ఇళ్లను పేదలకు కేటాయించారని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన భాజపా ఒక్క ఇంటినీ కొత్తగా కేటాయించలేదన్నారు. అంతకు మునుపు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల నిర్మాణాలనే పూర్తి చేసి, కొందరు లబ్ధిదారులకు ఇచ్చిందని గుర్తు చేశారు. భాజపా అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఇళ్లను కేటాయించిందని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు