logo

త్వరితగతిన రైల్వేస్టేషన్ల ఉన్నతీకరణ

యశ్వంతపుర, కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్ల ఉన్నతీకరణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి అవుతాయని కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ తెలిపారు.

Published : 01 Jul 2024 02:14 IST

యశ్వంతపుర రైల్వేస్టేషన్‌ వద్ద నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించి అధికారులతో చర్చిస్తున్న కేంద్ర మంత్రులు వి.సోమణ్ణ, శోభాకరంద్లాజె

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: యశ్వంతపుర, కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్ల ఉన్నతీకరణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి అవుతాయని కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ తెలిపారు. ఆదివారం ఇక్కడ ఆయన కేంద్ర మంత్రి శోభాకరంద్లాజెతో కలిసి రెండు స్టేషన్లను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను తిలకించారు. అధికారులు ఇంజినీర్లతో చర్చించారు. కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌ ఉన్నతీకరణ పనులకు రూ.480 కోట్లు, యశ్వంతపుర రైల్వేస్టేషన్‌ నిర్మాణ పనుల కోసం రూ.550 కోట్లు వ్యయం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం 50 శాతం పనులు పూర్తి చేశారని, మిగతా పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామన్నారు. పనులు పూర్తయితే ప్రయాణికులకు ఎక్కువ సౌకర్యాలు దొరుకుతాయని, రైళ్ల సంఖ్య పెరుగుతాయని పేర్కొన్నారు. మల్లేశ్వరం, కెంగేరి, శ్రీకృష్ణదేవరాయ రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని