logo

క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం

క్రీడా పోటీల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండి చదువుల్లోనూ చేరుకుగా ఉంటారని భారత వాలీబాల్‌ జట్టు ప్రధాన కోచ్‌, ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024 నిర్దేశకుడు డా.హెచ్‌.డి.కృష్ణప్ప పేర్కొన్నారు.

Published : 29 Jun 2024 01:44 IST

వీఎస్కేయూలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు

మాట్లాడుతున్న భారత వాలీబాల్‌ మాజీ కోచ్‌ హెచ్‌.డి.కృష్ణప్ప

బళ్లారి, న్యూస్‌టుడే: క్రీడా పోటీల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండి చదువుల్లోనూ చేరుకుగా ఉంటారని భారత వాలీబాల్‌ జట్టు ప్రధాన కోచ్‌, ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024 నిర్దేశకుడు డా.హెచ్‌.డి.కృష్ణప్ప పేర్కొన్నారు. విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దైహిక శిక్షణ, క్రీడా విజ్ఞాన విభాగం, కర్ణాటక వాలీబాల్‌ సంస్థ, బళ్లారి, విజయనగర జిల్లాల వాలీబాల్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం వీఎస్కేయూలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోటీ ప్రపంచంలో క్రీడలు మంచి క్రీడాకారులను తయారు చేస్తాయన్నారు. పట్టుదలతో జట్టు విలువను పెంచండి టోక్యో ఒలింపిక్స్‌లో వాలీబాల్‌ ప్రారంభమైంది. వాలీబాల్‌ ఒక మనోహరమైన క్రీడ, ఒలింపిక్స్‌లో ప్రవేశించేందుకు వాలీబాల్‌కు 40 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చిందన్నారు. క్రీడా వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు పోటీగా మారతాయి. ప్రస్తుతం బ్రెజిల్, క్యూబా చైనా వాలీబాల్‌ క్రీడల్లో అత్యంత అభివృధ్ధి చెందుతున్నాయని వివరించారు. బళ్లారి వీరశైవ మహావిద్యాలయం వ్యాయామ విశ్రాంత అధ్యాపకుడు చంద్రశేఖర్‌గౌడ మాట్లాడుతూ వాలీబాల్‌ ఒలింపిక్స్‌లో ఎగ్జిబిషన్‌ క్రీడగా ప్రసిద్ధి చెందిందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉపకులపతి తిప్పేరుద్రప్ప మాట్లాడుతూ బళ్లారిలో జరిగే వాలీబాల్‌ పోటీలకు ప్రముఖ శిక్షకుడు కృష్ణప్ప రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీల్లో పాల్గొన్న జట్లు గెలుపొంది, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాలన్నారు. కర్ణాటక వాలీబాల్‌ సంస్థ నిర్వహణ బోర్డు సంచాలకులు వెంకటేశ్, నారాయణస్వామి, చౌదాపుర్, చిక్కసంజయ్య, విజయనగర జిల్లా వాలీబాల్‌ సంస్థ అధికారి ప్రవీణ సింగ్, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వాలీబాల్‌ కోచ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని