logo

‘మర్డర్‌ ఆఫ్‌ రేణుకాస్వామి’ పేరిట వికీపీడియాలో కొత్త పేజీ..!

నటుడు దర్శన్, నటి పవిత్రాగౌడ చేతిలో హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి కేసు వ్యవహారం చర్చకు తావిస్తోంది.

Updated : 29 Jun 2024 07:33 IST

రేణుకాస్వామి (ఎడమ), దర్శన్‌ (కుడి) 

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : నటుడు దర్శన్, నటి పవిత్రాగౌడ చేతిలో హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి కేసు వ్యవహారం చర్చకు తావిస్తోంది. ఇదే అంశంపై వికీపీడియాలో కొత్త పేజీ ప్రారంభమైంది. ‘మర్డర్‌ ఆఫ్‌ రేణుకాస్వామి’ పేరిట ప్రారంభించిన ఈ పుటలో మొదటి నుంచి హత్యకు గురయ్యేంత వరకు రేణుకాస్వామి జీవితం, అతని తల్లిదండ్రులు, భార్య, అతనితో పరిచయం ఉన్న వారి వివరాలను నమోదు చేశారు. హత్యకు దారి తీసిన పరిణామాలు, హంతకుల అరెస్టు, తదితర వివరాలను ఇందులో పొందుపరిచారు. ఈ పుటలో ఎప్పటికప్పుడు తాజా వివరాలను భర్తీ చేసేందుకు అవకాశాన్ని కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని