logo

ఆలయ భూముల్లో సోలార్‌ ప్లాంట్లు

ఉమ్మడి జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో వందలాది ఎకరాల్లో భూములుండగా, అందులో కొన్ని ఎకరాలలో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు.

Published : 05 Jul 2024 06:04 IST

ప్రతిపాదనలు పంపిన అధికారులు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం: ఉమ్మడి జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో వందలాది ఎకరాల్లో భూములుండగా, అందులో కొన్ని ఎకరాలలో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. మంత్రి కొండా సురేఖ ఆదేశం మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. బీడుగా ఉన్న భూముల్లో సోలార్‌ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అన్ని జిల్లాలో అనువుగా ఉన్న భూములను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే కొన్ని నిబంధనలు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 వేల ఎకరాలు ఉన్నాయి.

దాదాపు 20 ఎకరాల్లో...: ఉమ్మడి జిల్లాలో 20 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయొచ్చని అధికారులు ప్రతిపాదనలు పంపారు. సోలార్‌ కంపెనీ సంస్థ ఈ భూములను 15 ఏళ్లకు పైగా లీజుకు తీసుకుంటుంది. ఎకరాకు లీజు రూ.15 వేలు చెల్లించే అవకాశముంది. సబ్‌స్టేషన్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమినే తీసుకోవాలని భావిస్తున్నారు. సాధారణంగా బీడుగా ఉన్నవి, సబ్‌స్టేషన్‌కు ఎక్కువ దూరంలో ఉన్నవి అధికంగా ఉన్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. భవిష్యత్తులో వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే భూములను పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపాదనలు పంపించారు. అయిదు దేవాలయాల పరిధిలో ఉన్న దాదాపు 20 ఎకరాలు అనుకూలంగా ఉన్నట్లు ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని