logo

రెండు సహకార సంఘాలకు రాష్ట్ర స్థాయి పురస్కారం

జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఆధ్వర్యంలో జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యాయి

Published : 05 Jul 2024 05:53 IST

మంత్రి నాగేశ్వరరావు నుంచి చెక్కు అందుకుంటున్న కాల్వశ్రీరాంపూర్‌ సంఘం ఛైర్మన్‌ రాంచంద్రారెడ్డి

కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి, న్యూస్‌టుడే: జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఆధ్వర్యంలో జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రుణాల పంపిణీ, రికవరీలో వంద శాతం వ్యాపారం చేసిన సహకార సంఘాలను టీఎస్‌క్యాబ్‌(తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల సమాఖ్య) ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాల్వశ్రీరాంపూర్, అప్పన్నపేట సహకార సంఘాల అధ్యక్షులు చదువు రాంచంద్రారెడ్డి, చింతపండు సంపత్‌లు రాష్ట్ర సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా రూ.25 వేల చొప్పున నగదు పురస్కారాలు అందుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు