logo

రేపటి నుంచి ప్రత్యేక పాలన

జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లాలో 18 మండలాల ఉండగా కొత్తగా ఎండపల్లి, బీమారం మండలాలు ఏర్పాటు కాగా గత ఎన్నికలు జరిగిన 18 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు.

Published : 04 Jul 2024 02:18 IST

జగిత్యాల రూరల్‌ మండల ఎంపీటీసీ సభ్యులతో జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల, జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లాలో 18 మండలాల ఉండగా కొత్తగా ఎండపల్లి, బీమారం మండలాలు ఏర్పాటు కాగా గత ఎన్నికలు జరిగిన 18 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. అందులో 9 మంది మహిళా సభ్యులు ఉండగా జగిత్యాల రూరల్‌ జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచిన దావ వసంత జడ్పీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. జడ్పీ సీఈవోగా రఘువరన్‌ ఉండగా జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.

జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అన్ని మండల పరిషత్తు కార్యాలయాల్లో ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు. జిల్లాలో 18 మంది ఎంపీపీలు ఉండగా 9 మంది మహిళలు ఉన్నారు. 214 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. శాసన సభ ఎన్నికల తర్వాత సర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు అనుకున్నా ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో పంచాయతీలు ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగియడటంతో స్థానిక సంస్థలు పూర్తిగా ప్రత్యేక అధికారుల చేతుల్లోనే ఉండనున్నాయి. మండల పరిషత్తు ప్రత్యేక అధికారులుగా జిల్లాస్థాయి అధికారులను నియమిస్తూ కలెక్టర్‌ సత్యప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని