logo

కార్యకర్తలకు అండగా ఉంటాం

నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

Published : 02 Jul 2024 06:17 IST

ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌

సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌ చిత్రంలో మాజీ మంత్రులు ఈశ్వర్, రాజేశంగౌడ్, ఎమ్మెల్సీ రమణ,
ఎమ్మెల్యే డా.సంజయ్, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రవిశంకర్, చందర్‌ తదితరులు

జగిత్యాల, న్యూస్‌టుడే: నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఎవరో ఒకరు పార్టీ వదిలి పోయారని భయపడాల్సిన అవసరం లేదని తాను, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌ వస్తామని ఎమ్మెల్సీ రమణ, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు వారానికి అయిదురోజులు అందుబాటులో ఉంటారన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని కష్టాలు వచ్చినప్పుడే మనిషి విలువ తెలుస్తుందని కేటీఆర్‌ అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ భారాస పాలనలో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చరిత్రలో కేసీఆర్‌ మార్కును చేరిపేయలేరన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు తలదించుకోవాలని కార్యకర్తలు, నాయకులు తప్పు చేసినట్లుగా ఉండవద్దని పార్టీ పునర్‌ వైభవం సాధించేందుకు కష్టపడాలని ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామన్నారు. భారాస జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అండగా ఉంటామని ఒక్కరోజు కూడా ఉద్యమంలో లేని సంజయ్‌కుమార్‌కు మూడుసార్లు టికెట్‌ ఇచ్చి రెండుసార్లు గెలిపిస్తే కాంట్రాక్టులు, బిల్లుల కోసం ప్రజలను మోసం చేసి పార్టీ మారాడని దమ్ముంటే రాజీనామా చేయాలని అన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యేను కవిత కష్టపడి గెలిపిస్తే వ్యక్తిగత ప్రయోజనం కోసం పార్టీ మారారని తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ మాట్లాడుతూ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను గెలిపించారని ఆయన పార్టీ మారినా పట్టించుకోవద్దన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ ఎంపీగా కవిత అయిదేళ్లపాటు జగిత్యాల అభివృద్ధికి నిధులు తెచ్చారని కష్టపడి సంజయ్‌ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆమె జైలుకు వెళ్లిందని చూడకుండా పార్టీ మారి మోసం చేశారన్నారు. మాజీ మంత్రి రాజేశంగౌడ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ తదితరులు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, లోక బాపురెడ్డి, రవీందర్‌సింగ్, చల్మెడ లక్ష్మినర్సింహరావు, రమణారావు, ముప్పాల రాంచందర్‌రావు, జడ్పీ వైస్‌ఛైర్మన్‌ హరిచరణ్‌రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. సమావేశం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఫోన్‌లో కొడిమ్యాల మండలం సర్పంచుల ఫోరం మాజీ మండలాధ్యక్షులు పునుగోటి కృష్ణారావుతో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణారావు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

హాజరైన కార్యకర్తలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని